ఐఐటీ గౌహతి టెక్నో మేనేజ్మెంట్ ఫెస్టివల్ "Techniche"

దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్దల్లో ఒకటైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IITG) తన 15వ టెక్నో - మేనేజ్‌మెంట్ ఫెస్టివల్ పేరుతో Techniche 2013 ప్రారంభించనుంది. ఈ ఫెస్టివల్ లాభాపేక్షలేనిది. ఈ పెస్టివల్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, నాణ్యత కార్ఖానాలు, సామాజిక కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా సవాలుతో కూడుకున్న పోటీలు నిర్వహించడుతున్నాయి.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IITG)కి చెందిన వ్యవస్థాపక అభివృద్ధి సెల్ సహకారంతో "ది కార్పోరేట్ మాడ్యుల్" పేరుతో ఈ మేనేజ్‌మెంట్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్‌లో ముఖ్యమైన కార్యక్రమాలు వరుసగా...

Techniche 2013

బ్రెయిన్ చైల్డ్ (Brain Child): ఇది బిజినెస్ ప్లాన్ కాంపిటేషన్. ఈ కాంపిటేషన్‌లో పాల్గొన్న వారు వారి యొక్క బిజినెస్ ఐడియాలు ఇండియన్ ఏంజెల్ నెట్ వర్క్, జెమిని న్యూ మీడియా వెంచర్స్, నిర్వాణా వెంచర్ అడ్వైజర్స్ మరియు ముంబై ఏంజెల్స్ లాంటి వారితో పాలు పంచుకోవాల్సి వస్తుంది. ఈ కాంపిటేషన్‌లో పాల్గొనదలచే వారు వారియొక్క ఎంట్రీలను పంపడానికి చివరి తేదీ జూన్ 15. ఇందులో గెలిచిన వారికి ఇచ్చే క్యాష్ ప్రైజ్ రూ. 50,000.

కేస్ స్టడీ (Case Study): ఈ కాంపిటేషన్‌ను హార్వర్డ్ బిజినెస్ రివ్యూ బోర్డుకు చెందిన వారు నిర్వహిస్తున్నారు. దీనిని భాగస్వాములు మరియు పోటీదారుల నైపుణ్యాలను పటిష్టం సహాయపడే విధంగా ఒక కార్డినల్ లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారు. పాల్గొనేందుకు చివరి తేది జూన్ 30. ప్రైజ్ మనీ రూ. 38,000.

యుద్ధతంత్రం (Stratagem): ఈ కాంపిటేషన్‌లో మీకు ఇచ్చిన సమస్యకు సరైన మార్కెటింగ్ స్ట్రాటజీని తెలియజేయాలి.

ఉత్పత్తి ప్రారంభం (Product Launch): మార్కెట్ లోకి కొత్త వినూత్న ఉత్పత్తి తీసుకువచ్చేందుకు కృషి.

బ్లూ చిప్స్ (Blue Chips): స్టాక్ మార్కెట్ గేమ్

పోస్టర్ మానియా (Postermania): మీరు ఒక పోస్టర్ సహాయంతో ఉత్పత్తి మరియు దాని ముఖ్య అంశాలను తెలియజేయడం.

పైన నిర్ణయించిన ఈవెంట్స్ జడ్జిమెంట్ కోసం మరింత పరిజ్ఞానం అనుభవం కలిగిన పెట్టుబడిదారులు మరియు వ్యవస్థాపకులతో కూడిన ఒక ప్యానెల్ ఉంది. అంతిన నిర్ణయాధికారం న్యాయ నిర్ణీలతే. ఈ అధ్బుతమైన ఈవెంట్‌లో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే వెంటనే www.techniche.org వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వండి.

మరింత సమాచారం కోసం +91 8876406180 లేదా +91 8011241189 ఫోన్ నంబర్లను సంప్రదించండి.

సందేహాల నివృత్తి కోసం [email protected] మెయిల్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+