ఘోరం: యువతి ఆత్మహత్య, బాలికపై హత్యాయత్నం

పోలీసులు సుబానీని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన అతను, తనపై పెట్టిన కేసును విరమించుకోవాలని లావణ్యను వేధిస్తూ వచ్చాడు. మెసేజ్‌లు పంపుతూ కేసు విరమించుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గుంటూరులో ప్రేమను నిరాకరించిన బాలికపై ఓ ఉన్మాది స్నేహితులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. గుంటూరు సమీపంలోని గోరంట్లకు చెందిన ఇంటర్ విద్యార్థిని (17)పై అదే ప్రాంతానికి చెందిన సునీల్‌కుమార్ పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. దాంతో ఆమె తల్లి దండ్రులకు చెప్పింది. కుమారుడితో కలిసి వారు సునీల్ ఇంటికి వెళ్లి హెచ్చరించి వచ్చారు. సునీల్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యా దు చేయటంతో పోలీసులు ఆ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.
అయినా సునీల్ రెచ్చిపోయాడు. శుక్రవారం కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థిని ఆటో ఎక్కగా, సునీల్ స్నేహితులు రాజు, అశోక్ కూడా ఆటో ఎక్కా రు. లారీ డ్రైవర్ సునీల్‌ను పెళ్లి చేసుకోకుంటే చంపుతామని బెదిరించారు. ఆమె ఆటోలో నుంచి దూకేందుకు ప్రయత్నించగా ఇద్దరూ ఆమెను గట్టిగా పట్టుకుని తమతో తెచ్చుకున్న విషం కలిపిన శీతల పానియాన్ని బలవంతంగా తాగించారు. అనంతరం కళాశాల సమీపంలో ఆమెను వదిలి పరారయ్యారు.












Click it and Unblock the Notifications