స్థల వివాదం: మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి అరెస్టు

స్థానికలకు మాజీ మేయర్ కార్తీకరెడ్డి మద్దతుగా నిలిచారు. అధికారులకు, స్థానికులను మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయం కోరారు. వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు రంగప్రవేశం చేసి కార్తికరెడ్డి సహా 200 మందిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
లాలాపేట పోచమ్మ దేవాలయం స్థల వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ వివాదంపై కోర్టుకు కూడా ఎక్కారు. బండ కార్తిక రెడ్డి భర్త చంద్రారెడ్డి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.
వాస్తు ప్రకారం పోచమ్మ ఆలయం ఆవరణను సిద్దం చేశామని, దాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని బండ కార్తిక రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆలయం ఎదుట స్థానికులతో కలిసి బండ కార్తిక రెడ్డి ధర్నా నిర్వహించారు.












Click it and Unblock the Notifications