చంపేస్తానని బెదిరిస్తున్నాడు: క్రికెటర్ గోనీపై తల్లి

Manpreet Singh Gony
చండీఘర్: క్రికెటర్ మన్‌ప్రీత్ సింగ్ గోనీ తల్లి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. మొహాలీలోని ఆస్తి వివాదంపై తనను చంపేస్తానని గోనీ బెదిరిస్తున్నాడని అతని తల్లి శుక్రవారం ఫిర్యాదు చేసింది. మన్‌ప్రీత్ సింగ్ గోనీపై 70 ఏళ్ల తల్లి మొహిందర్ కౌర్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది.

తనకు ఏమైనా జరిగితే బాధ్యత గోనీదేనని ఆమె అన్నది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో కీలకమైన వ్యక్తి గోనీయేనని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అన్న, అతని భార్య, తన భార్య ప్రోద్బలంతో గోనీ తనను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనపై అక్రమ చర్యలకు తన భర్త కూడా వారికి సహకరిస్తున్నట్లు చెప్పింది. మొహాలీలోని తన నివాసంలో ఆమె ఉంటోంది. తీవ్ర పరిణామాలుంటాయని గోనీ పలుమార్లు తనను హెచ్చరించాడని చెప్పింది.

గోనీ, అతని సోదరుడు మన్మోహన్ సింగ్, అతని భార్య అమన్‌దీప్ కౌర్, తన భర్త శర్వాన్ సింగ్ తనను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించింది. తన బంధువల చేతుల్లోనే ఈ వయస్సులో తాను ఇబ్బందులు పడుతున్నానని అన్నది.

ముగ్గురు అన్నదమ్ములలో గోనీ చిన్నవాడు. మరో సోదరుడు విదేశాల్లో ఉంటున్నాడు. తన తల్లి చేసిన ఆరోపణలను గోనీ ఖండించాడు. అవన్నీ నిరాధారమని అన్నాడు. ఆరేళ్ల క్రితమే తాను తన కుటుంబం నుంచి విడిపోయానని, ఆ తర్వాత వాళ్లతో తనకు ఏ విధమైన సంబంధం లేదని గోనీ స్పష్టం చేశాడు. తన తల్లి వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదని హిమాచల్ ప్రదేశ్‌ నుంచి అతను ఫోన్‌లో పిటిఐ వార్తా సంస్థతో చెప్పాడు.

ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, నిజానిజాలను ధ్రువీకరించుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆస్తులపై, భూమిపై కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+