'ఉప్పల్ వైయస్సార్' ఆత్మహత్య: నోట్‌లో జగన్‌కు విజ్ఞప్తి

ఆ సూసైడ్ నోట్‌లో తనను వేధిస్తున్న వారిని పేర్కొనడంతో పాటు.. తనను అంబరుపేటలోని ఓ భవంతిలోకి తీసుకు వెళ్లి మూడు రోజుల పాటు తనను కొట్టారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో పది పేజీల సూసైడ్ నోట్‌లో ఓ పేజీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ విజ్ఞప్తిని చేశారు. తాను చనిపోయాక.. తన పిల్లలను, కుటుంబాన్ని ఆదుకోవాలని జగన్‌కు ఓ పేజీలో విజ్ఞప్తి చేశారు.
కాగా తనను పది లక్షల రూపాయలు అడిగితే ఇవ్వలేక, మూడు లక్షలు ఇవ్వడానికి సిద్ధపడినా కనికరించలేదని, మరికొన్ని కేసులు పెట్టి శాశ్వతంగా జైలుకు పంపిస్తానని, రౌడీషీట్ తెరుస్తానని బెదిరించే వారని యంజాల శ్రీధర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదిన తనపై కక్షగట్టి జైలుకు పంపారన్నారు.
కాగా శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం నడుచుకున్నానని ఏఎస్పీ రాధాకృష్ణ తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎసిపిని సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications