కిడ్నాప్ యత్నం: తప్పించుకున్న ఇంటర్ అమ్మాయి

కాల్వలో దూకి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈవురుపాలెం వద్ద ఓ కాల్వలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకుపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారని మనస్థాపం చెంది ఈ చర్యకు పడ్డట్లుగా తెలుస్తోంది.
ప్రేమికులు ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖపట్నం జిల్లాలోని మాకవరపుపాలెంలోని ఏలేరు కాలువలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.
బాలుడు కిడ్నాప్
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఓ నాలుగేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. రూ.7 లక్షలు ఇస్తే విడుస్తామని కిడ్నాపర్లు బెదిరిస్తున్నారు.
వ్యక్తి సజీవ దహనం
మహబూబ్ నగర్ జిల్లాలో సంజీవ రెడ్డి అనే వ్యక్తిని సజీవ దహనం చేశారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని హత్య చేశాడనే అనుమానంతో ఇతనిని సజీవ దహనం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలంలో ఓ తండ్రి కూతురుకు పురుగుల మందు తాగించడంతో ఆమె మృతి చెందింది.












Click it and Unblock the Notifications