ఉత్కంఠకు కాంగ్రెస్ తెర: 'తెలంగాణ'తో వారిని కొట్టేద్దాం!?

హైదరాబాద్: అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణ సమస్యకు త్వరలో ఓ పరిష్కారాన్ని చూపించనుంది. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు విభజన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. తొలుత రాయల తెలంగాణ అనే ప్రచారం సాగినప్పటికీ దిగ్విజయ్ కర్నాటకలో చేసిన వ్యాఖ్యలతో తెలంగాణకే అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మూడు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు పార్టీలకతీతంగా ఎవరికి వారు విడిపోయి తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు చెబుతుండగా, సమైక్యాంధ్ర తప్ప మరో ప్రత్యామ్నాయం ఒప్పుకునేది లేదని సీమాంద్రకు చెందిన పలువురు నేతలు చెబుతున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన హీట్ తగ్గినప్పటికీ శోభా నాగి రెడ్డి వంటి నేతలు మాత్రం సీమను విభజిస్తే ఊరుకునేది లేదంటున్నారు.

రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు, రాజకీయ నాయకులు.. ఇలా చాలామంది విభజన జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చారనే చెప్పవచ్చు. 2009లో లాగా ఇప్పుడు సీమాంధ్ర నేతలు ఒకవేళ తెలంగాణను అడ్డుకోవాలని చూసినప్పటికీ అధిష్టానం వినిపించుకునే స్థితిలో లేదని కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో విభజన జరిగితే ఏఏ పార్టీలు ఎక్కువ నష్టపోతాయనే, ఏ పార్టీలు లబ్ధి పొందుతాయనే చర్చ ప్రధానంగా సాగుతోంది.

Telangana

ప్రధానంగా కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే వ్యూహరచన చేసిందని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే సీమాంధ్రలో వ్యతిరేకత, తెలంగాణలో క్రెడిట్ ఇతర పార్టీలకు వెళ్తుందనే అభిప్రాయంతో కాంగ్రెసు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెసుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సొంత పార్టీ సర్వేలు చెప్పాయని అంటున్నారు.

అందుకే కాంగ్రెసు తెలంగాణ వైపు మొగ్గు చూపుతోందంటున్నారు. 2009లో వలే తెలంగాణపై ప్రకటన చేసి ఈసారి తప్పించుకునే అవకాశం, మాట మార్చే అవకాశాలు లేవంటున్నారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున ఇచ్చిన మాటకు ఖచ్చితంగా కట్టుబడాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై ప్రకటన చేస్తుందని అంటున్నారు. విభజన ప్రకటన ద్వారా రెండు ప్రాంతాల్లో కలిపి ఎక్కువ స్థానాలు కాంగ్రెసు వశం అవుతాయనే అభిప్రాయానికి కాంగ్రెసు వచ్చిందంట.

తెలంగాణపై ప్రకటన చేస్తే ఆ క్రెడిట్ కాంగ్రెసు పార్టీకి రావడమే కాకుండా, రాష్ట్రం కోసం పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదని, ఎన్నికలకు ముందు ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెసు పార్టీ పేరే ప్రధానంగా ప్రజల్లో నానుతుందని, క్రెడిట్ కాంగ్రెసుతో పాటు ఇతర పార్టీలకు వెళ్లినా, అది తమ ప్రకటనతో కొట్టుకుపోతుందని భావిస్తోందని అంటున్నారు. తద్వారా తెలంగాణలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవచ్చునని భావిస్తోందట.

ఇక సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని భావిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సెంటిమెంట్ బలంగా లేనందున సీమాంధ్ర నేతల ద్వారా సాధ్యమనన్ని ఎక్కువ స్థానాలను గెలిపించుకోవాలని చూస్తోందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రం నుండి కేబినెట్లోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది సీమాంధ్ర నేతలే ఉన్నారు. ఇది ఆ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. కావూరి వంటి సమైక్యవాదిని అధిష్టానం మౌనంగా ఉంచేలా చేసిందని చెబుతున్నారు.

మరికొందరు సీమాంధ్ర కోసం పట్టుబట్టినా వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలలోకి వెళ్లని వారు ఉంటారని, వారు కచ్చితంగా కాంగ్రెసు పార్టీతో ఉండక తప్పదని అధిష్టానం భావిస్తోందట. విభజన ద్వారా క్రెడిట్ కొట్టేసి తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయడం, సీమాంధ్రలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొందడమే అంటున్నారు. విభజిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనమవుతుందని, చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని భావిస్తోందని అంటున్నారు. రెండో వారంలో కోర్ కమిటీ భేటీ అయి ఓ నిర్ణయం తీసుకోనుందట.

మరోవైపు దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కర్నాటకలో మాట్లాడుతూ.. తమ దృష్టి అంతా దక్షిణాది పైనే ఉందని చెప్పారు. 2014 ఎన్నికలలో కాంగ్రెసు తిరిగి అధికారం చేజిక్కించుకోవడం దక్షిణాది రాష్ట్రాలతోనే సాధ్యమని చెప్పారు. ఎపిలో విభజన ద్వారా ఎక్కువ సీట్లు పొందాలని చూస్తున్నారు. ఇక కేరళ, కర్నాటకలో కాంగ్రెసు ప్రభుత్వాలు ఉండటంతో అక్కడ కూడా ఎక్కువ స్థానాలు తామె గెలుచుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణను ఇవ్వడం ద్వారా దక్షిణాదిన యాభై స్థానాలను గెలుచుకోవచ్చునని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+