మోపిదేవి వెంకటరమణకు అస్వస్థత, నిమ్స్‌కు తరలింపు

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ అంశంలో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు మోపిదేవి వెంకట రమణకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

జైల్లో ఉన్న ఆయనకు వెన్నునొప్పి వచ్చింది. దీంతో జైలు అధికారులు మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్‌) ఆసుపత్రికి తరలించారు. ఆయన తీవ్రమైన వెన్ను నొప్పితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.

మోపిదేవి వెంకటరమణ ఇరవై రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆయనను జైలుకు తరలించారు.

కావేటి సమ్మయ్యకు అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర సమితి అదిలాబాదు సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయన తన ఇంటిలో అస్వస్థత చెందారు. దీంతో ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+