జగన్‌కు ఝలక్: గద్దె బాబురావు రాజీనామా, టిడిపిలోకి

గద్దె బాబురావు ఈ రోజు ఉదయం చీపురుపల్లి మండలం అలజంగి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్టీలోకి వచ్చాక తల్లిలాంటి తెలుగుదేశం పార్టీని వీడినందుకు ఇంత అవమానమా అంటూ ఏడ్చిన రోజులు ఉన్నాయన్నారు.
నియోజకవర్గ ఇంఛార్జిని ఖరారు చేయాలని తాను ఎన్నో రోజులుగా పార్టీ పెద్దలను, జిల్లా నాయకులను కోరుతున్నప్పటికీ స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను సమన్వయకర్తల పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గద్దె ముగ్గురు సమన్వయకర్తల్లో ఒకరిగా ఉండలేక ఆ పదవికి రాజీనామా చేశారు.
కాగా గద్దె బాబురావు తిరిగి సొంత గూటికి చేరే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపిలోకి వెళ్దామని పలువురు కార్యకర్తలు గద్దెను కోరినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా గద్దె పార్టీ అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కంటే ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications