సోనియా గాంధీ చిత్రం మార్ఫింగ్, అసభ్యకర వ్యాఖ్యలు

Sonia Gandhi
భోపాల్: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ చిత్రాన్ని అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని జలంధర్‌కు చెందిన సందీప్ భల్ల అనే బిజెపి కార్యకర్త రెండు రోజుల క్రితం ఈ పని చేశాడు.

సోనియా ఫోటోను మార్పింగ్ చేసి, అసభ్యకర వ్యాఖ్యలతో దానిని తన ఫేస్‍‌బుక్ పేజీలో పోస్టు చేశాడు. దీనిని గుర్తించిన స్థానిక కాంగ్రెసు నేత సంజయ్ సెహగల్ పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాడు. ఆయన ఫిర్యాదు మేరకు భల్లా పైన ఐటి యాక్టు కింద కేసును నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ గౌరవ్ యాదవ్ చెప్పారు.

భల్లా ఫేస్‌బుక్ చూస్తే అతను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పెద్ద అభిమాని అని అర్థమవుతోందట. 'నమో'ను ప్రధానమంత్రిగా చూడాలని తన ఫేస్‌బుక్ పేజీలో భల్లా రాశాడు. నరేంద్ర మోడీని 'నమో'గా పిలుస్తారు. బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్య నేత నితీష్ కుమార్ చిత్రాన్ని కూడా అసభ్యకరంగా మార్ఫింగ్ చేశాడు.

వ్యంగ్యం, ఘాటైన వ్యాఖ్యలు రాజకీయాల్లో సాధారణమేనని, అయితే ఇలాంటి చర్యలు మాత్రం సరైనవి కావని, ఓ మహిళ విషయంలో ఇలా వ్యవహరించడం మంచిది కాదని సంజయ్ సెహగల్ అన్నారు.

దీనిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కమల్ శర్మ ఖండించారు. బిజెపి ఇలాంటి చర్యలను సహించదని అన్నారు. తమ పార్టీ మహిళలను గౌరవిస్తుందని, వీటిని ఎవరూ క్షమించరన్నారు. పార్టీ కార్యకర్త ఇలాంటి పనికి పూనుకుంటే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+