సభ పెట్టుకోండి కానీ, రేఖ దాటొద్దు: సీమాంధ్రులకు డిగ్గీ

దిగ్విజయ్‌ను అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి మంగళవారం కలిశారు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు కూడా అక్కడే ఉన్నారు. తెలంగాణ నేతల తరహాలోనే తాము కూడా సభలు నిర్వహించుకుంటామని వెంకట్రామి రెడ్డి కోరారు. సభ కోసం అనుమతించిన దిగ్విజయ్ పార్టీ లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అయితే అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు.
విజయవాడ లేదా విశాఖపట్నంలో భారీ స్థాయిలో, అనంతపురం లేదా కర్నూలులో ప్రాంతీయ సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. తేదీల ఖరారు కోసం బుధవారం భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి అనంత వెంకట్రామి రెడ్డి కాస్త ఘాటుగానే దిగ్విజయ్‌ను ప్రశ్నించారట. రాష్ట్ర విభజను తాము గుడ్డిగా వ్యతిరేకించడంలేదని.. సహేతుకమైన కారణాలతోనే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దీంతో రాష్ట్ర విభజన విషయంలో తాము అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని దిగ్విజయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications