శంకర్రావు బెదిరింపు: డిజిపి, సాయి పిటిషన్ పైన సిబిఐ

Dinesh Reddy and Vijaya Sai Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు పైన డిజిపి దినేష్ రెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర రావు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనను, పోలీసు కమిషనర్‌ను బెదిరించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. తను చెప్పిన వారిని బదలీ చేయనందుకే బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారన్నారు.

తన పేరు మీద చీమ తలకాయంత ఆస్తులు ఉన్నా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకోవచ్చునని చెప్పారు. తనపై శంకర రావు కక్ష కట్టారని, అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన ఆస్తుల వివరాలను ఎవరైనా తెలుసుకోవచ్చునని చెప్పారు. రెడ్ల మీదున్న ఆస్తులన్నీ తనవే అంటే ఎలానని ఎద్దేవా చేశారు.

జగన్ కేసులో...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని రెండో ఛార్జీషీటుకు అనుబంధ అభియోగ పత్రాన్ని విచారణకు స్వీకరించవద్దన్న విజయ సాయి రెడ్డి పిటిషన్ పైన సిబిఐ కోర్టులో వాదనలు జరిగాయి. తన పేరును తొలగించాలంటూ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించిన తర్వాత.. అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేయడం సరైంది కాదని సాయి వాదించారు.

ఓరియంటల్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న విషయం సిబిఐకి ముందే తెలుసునని, ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచి పెట్టిందని సాయి రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అనుబంధ ఛార్జీషీటులో పేర్కొన్న విషయాలు కొత్తగా సేకరించినవని సిబిఐ తరఫు న్యాయవాది సురేంధ్ర తెలిపారు. కొత్త సమాచారం వస్తే కోర్టుకు ఇచ్చే అధికారం ఉందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న సిబిఐ కోర్టు నిర్ణయాన్ని 26వ తేదికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+