ఆలోచన ఉంటే కెసిఆర్‌తో మాట్లాడుతుంది: 'టి'పై కెటిఆర్

తమ పార్టీని పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు నమ్మలేమన్నారు. తెలుగు తల్లి బలిపీఠమెక్కుతుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు.
బలిపీఠమెక్కేది.. తెలుగు తల్లి కాదని, లగడపాటి రాజకీయ భవిష్యత్తే అన్నారు. తెలంగాణపై తేల్చక తప్పని పరిస్థితులో ఇప్పుడు కాంగ్రెసు ఉందన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చెప్పారు. రాజకీయ పార్టీల రంగు చెప్పేందుకే తాము తీర్మానం కోసం పట్టుబట్టామన్నారు.
తెలంగాణ రాదు: భూమా
తెలంగాణ రాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమా నాగిరెడ్డి కర్నూలులో అన్నారు. రాయల తెలంగాణ ప్రసక్తే లేదన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications