తెలంగాణ, సీమాంధ్ర నేతల ఒత్తిడి: బొత్స ఏం చెప్తారు?

Botsa Satyanarayana
హైదరాబాద్: రాష్ట్ర విభజన, సమైక్యంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏం చెప్తారనే చర్చ సాగుతోంది. రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, బొత్సను ఆదేశించారు. దామోదర, కిరణ్ వైఖరులపై దాదాపు ఓ స్పష్టత ఉంటుందనే చెప్పవచ్చు. అయితే బొత్స ఏం ఇస్తారనే చర్చ సాగుతోంది.

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచితే ఏం చేయాలి? విభజిస్తే ఏం చేయాలి? అనేది సూచిస్తూ రోడ్ మ్యాప్ రూపొందించాలని దిగ్విజయ్ సూచించారు. నివేదికను ఉమ్మడిగా కానీ, విడివిడిగా కానీ ఇచ్చే స్వేచ్ఛను ఇచ్చారు. కిరణ్ సమైక్యవాదిగా ముద్రపడ్డారు. దామోదర తెలంగాణవాది. బొత్స వైఖరి మాత్రం అందరికీ ఉత్కంఠను కలిగిస్తోంది. బొత్స ప్రత్యేక వాదానికి సానుకూలంగా ఉన్నారని, పలుమార్లు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని తెలంగాణ నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే ఆయన సమైక్యవాదేనని, రాజమండ్రిలో ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన సమైక్యవాద సభకు హాజరు కావడమే అందుకు నిదర్శనమని సీమాంధ్రనేతలు అంటున్నారు. మరోవైపు బొత్సపై ఒత్తిడి పెంచాలని ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర నేతలకు గట్టిగా సూచించారు. దీంతో కన్వీనర్ శైలజానాథ్ నేతృత్వంలో బొత్సను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అధిష్ఠానానికి నివేదికను ఇవ్వాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా దామోదర రాజనరసింహ, జానారెడ్డి తదితరులు తెలంగాణ వైపే మొగ్గు చూపాల్సిందిగా బొత్సపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ బొత్స మాత్రం ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా కోర్ కమిటీ సమావేశంలో మౌఖికంగా తన అభిప్రాయాన్ని వెల్లడించే పనిలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+