దోపిడీ దొంగల బీభత్సం: వైన్ షాప్ ఓనర్‌పై కాల్పులు

వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దోపిడీ దొంగలు ముందస్తు ప్లాన్ ప్రకారమే వారిపై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని అనుమానిస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు కూకట్‌పల్లి, అల్వాల్ తదితర ప్రాంతాలలో నిందితుల కోసం గాలిస్తున్నారు.
వ్యక్తి హత్య
హైదరాబాదులోని మైలారుదేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాటేదాన్ శాంతినగర్‌లో ఉన్న ప్రయివేటు వెంచర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అతనిని హత్య చేసి గోనె సంచీలో తీసుకు వచ్చిన దుండగులు, అక్కడే పెట్రోల్ పోసి తగులబెట్టారు.
ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తిని కాల్చి చంపిన మావోలు
ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీ కొత్తపల్లి రహదారుపై పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో భగత్ అనే వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఏప్రిల్ 16న జరిగిన ఎన్‌కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందడానికి అతనే బాధ్యుడని ఘటనా స్థలంలో లేఖను వదిలారు.
దంపతుల సజీవ దహనం
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కొండాపురం మండలంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. వారు ఇంట్లో నిద్రిస్తుండగా మంటలు వ్యాపించడంతో బయటకు వచ్చే వీలులేక మంటల్లో చిక్కుకొని దహనమయ్యారు.












Click it and Unblock the Notifications