వైయస్ వెన్నుపోటుదారుడే: విహెచ్, లగడపాటికి సవాల్

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసి, తెలంగాణను అడ్డుకోవద్దని హితవు పలికారు. సమైక్యాంధ్ర సభలను పెడతామని చెబుతున్న సీమాంధ్ర నేతలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు సభలు పెట్టడం లేదని ప్రశ్నించారు. విభజన అసాధ్యమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయని, వాటిని తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు.
తీర్మానానికి అనుకూలంగా స్పందించాలి: వివేక్
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే సభ్యులంతా అనుకూలంగా స్పందించాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ విజ్ఢప్తి చేశారు. తాను పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశానని, అది కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తే తిరిగి వస్తారా.. అని ప్రశ్నిస్తే పరిస్థితులను బట్టి చూస్తామన్నారు.
ఆహ్వానం అందలేదు: ముఖేష్
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన తెలంగాణ సాధన సభకు ఆహ్వానం అందకపోవడం వల్లనే తాను వెళ్లలేదని మంత్రి ముఖేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications