అన్యాయం చేశారు: కాంగ్రెస్‌కు మోపిదేవి గుడ్‌బై

Mopidevi Venkataramana
గుంటూరు: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనుచరులు బుధవారం కాంగ్రెసు పార్టీని వీడారు. వెంకటరమణ సోదరుడు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, మోపిదేవి అభిమానులు మాజీ మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బిసి వర్గాలకు చెందిన మోపిదేవికి కాంగ్రెసు పార్టీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రేపల్లె నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేసిన వ్యక్తి ఆయన అన్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెసు పార్టీ నాయకులు, ఢిల్లీ నేతలు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన ఆరోగ్యం క్షీణించినా వైద్య పరీక్షలు చేయించడం లేదని ఆరోపించారు. మోపిదేవిని పార్టీ పట్టించుకోనందు వల్లనే తాము పార్టీని వీడుతున్నట్లు ఆయన సోదరుడు హరనాథ్ బాబు, ఇతర నేతలు చెప్పారు. తామంతా మోపిదేవి బాటలోనే నడుస్తామన్నారు. ఈ నెల 5వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కాగా అభిమానులు పార్టీని వీడటం ద్వారా ఆయన కూడా మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగానే భావించవచ్చు.

జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. జగన్ కూడా ఇదే జైలులో ఉన్నారు. మోపిదేవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నట్లుగా గతేడాది నుండే ప్రచారం సాగుతోంది. రెండు మూడు రోజుల క్రితం దీనిపై స్పష్టత వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+