ఉద్యోగమిస్తానని ఎయిర్ హోస్టెస్‌తో రాసలీలలు, మోసం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ముంబైకి చెందిన వ్యక్తి. బాధిత యువతి ఇంతకుముందు దుబాయ్‌లోని ఎమిరేట్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆమె... మూడేళ్ల క్రితం ముంబైలోని ఓ ఫంక్షన్ హాళ్లో నిందితుడితో పరిచయం ఏర్పడిందని పేర్కొంది.
తనకు ఉద్యోగం ఇస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడని ఆరోపించింది. గత జూన్‌లో తామిద్దరం కలిసి ఢిల్లీ వెళ్లామని, అక్కడ ఓ హోటల్లో గడిపామని చెప్పింది. తామిద్దరం ముంబై తిరిగి వచ్చే వరకు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది.
ముంబైకి తిరిగి వచ్చాక తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడని పేర్కొంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె గత వారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications