ఇష్రత్ ఇష్యూ: బూటకపు ఎన్‌కౌంటర్ల దుమారం

మృతులు టెర్రరిస్టులా, కాదా అనే చర్చ ఒక వైపు, వారు నిజమైన ఎన్‌కౌంటర్లోనే చనిపోయారా, బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా అనే చర్చ మరోవైపు జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో చర్చ ఎప్పటికప్పుడు మళ్లీ ముందుకు వస్తూ ఉంటుంది. 2006లో తీమర్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై వ్యక్తమైన అనుమానాలపై ప్రభుత్వం గానీ, మీడియా గానీ పెద్దగా దృష్టి పెట్టలేదు.
2004 - 2005 విషయాలను మానవ హక్కుల కమిషన్ నివేదికను బట్టి చూస్తే - బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పోలీసు కస్టడీ మరణాలు తగ్గాయి. కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో పెరిగాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అటువంటి కేసులకు సంబంధించి 122 సంఘటనలు మానవ హక్కుల కమిషన్‌కు ఆ ఏడాదిలో లాగా ఎక్కువగా కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో లేదా కాంగ్రెసు మద్దతుతో పాలన నడుస్తున్న రాష్ట్రాల నుంచి సంఘటనలు చేరాయి.
ఇదిలావుంటే, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్న ఆర్‌పిఎన్ సింగ్ లోకసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ - 2009 - 10 నుంచి 2012 -13 వరకు రాష్ట్రాలవారీగా బూటకపు ఎన్‌కౌంటర్లకు సంబంధించి ఆరోపణల కేసులు మానవ హక్కుల కమిషన్‌కు 555 వచ్చాయని చెప్పారు. వాటిలో 144 కేసులను పరిష్కరించగా, 411 కేసులు అపరిష్కృతంగా ఉండిపోయాయి.
ఆ సమాధానంలో బూటకపు ఎన్‌కౌంటర్లకు సంబందించి 2009 - 10, 2010 - 11, 2011 -12లలో సంభవించిన మరణాల వివరాలు కూడా ఇచ్చారు. 2009 -10లో మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా జరగగా, గుజరాత్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2010 -11 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో 40 కేసులు, కాంగ్రెసు పాలిత రాష్ట్రాలైన అస్సాం, ఆంధ్రప్రదేశ్, హర్యానాల్లో కలిసి 30 కేసులు నమోదయ్యాయి. 2011-12లో కూడా ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానం.
అలా చూస్తే, ఇష్రాత్ జహర్ ఎన్‌కౌంటర్ కేసును రాజకీయం చేయడం దురదృష్టకరమేనని చెప్పాలి. బాధితులకు, వారి కుటుంబాలకు అగౌరవం తెచ్చి పెట్టే విధంగా దాన్ని రాజకీయం చేశారు.












Click it and Unblock the Notifications