వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో కూలిన రెండంతస్థుల భవనం, ఒకరి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని థానే సమీపంలోని బీవండిలో ఓ భవనం కూలి ఒకరు మృతి చెందగా, పదిహేను మంది గాయపడ్డారు. రెండంతస్థుల ఈ భవనం బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మున్నా వజూర్ దివాన్ అనే ఇరవై అయిదేళ్ల కార్మికుడు మృతి చెందాడు.

విపత్తు నిర్వహణ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గరైన భవనంలో దుస్తుల తయారీ పరిశ్రమ ఉంది. అడిషనల్ పోలీస్ కమిషనర్ హిమ్మత్ రావు దేశ్‌బర్తర్ మాట్లాడుతూ.. భవంతి కూలిన సమయంలో అందులో 45 పనివాళ్లు ఉన్నారని, 25 సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

 godown collapsed

నిబంధనలు పాటించకపోవడం వల్లే భవనం కూలిందని ఓ బాధితుడు ఆరోపించారు. గాయపడ్డ వారిలో చాలామంది అక్కడకు ఉపాధి కోసం వచ్చిన వారే. భవనం కూలే సమయంలో పలువురు పై నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఏప్రిల్ 4న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో 74 మంది చనిపోయిన విషయం మరువక ముందే ఈ ఘటన జరిగింది.

English summary
One person was killed while 15 others were injured in yet another building collapse in Maharashtra midnight on Wednesday. The ill-fated two-storey building located in Bhiwandi near Thane housed a garment factory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X