వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పటికే ఓ భార్య: పెళ్లితో నటిని మోసగించిన నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai
ముంబై: అప్పటికే అతనికి ఓ భార్య ఉంది. అయినా, పెళ్లి చేసుకుని ఓ మరాఠీ నటిని ఓ రాజకీయ నేత మోసం చేశాడు. మహారాష్ట్రంలోని పాన్వెల్‌కు చెందిన సిద్ధార్థ బంతియా పెళ్లి చేసుకుని నటిని మోసం చేశాడంటూ కేసు నమోదైంది.

మిడ్ - డే కథనం ప్రకారం - బంతియా తనను మోసం చేశాడంటూ నటి ముంబై క్రైం బ్రాంచ్ మహిళా సమస్యల పరిష్కారం విభాగాన్ని సంప్రదించింది. కళాకారుల కోటాలో ప్రభుత్వం నుంచి ఫ్లాట్ ఇప్పిస్తానని తన నుంచి ఆరు లక్షల రూపాయలు తీసుకుని కూడా అతను మోసం చేశాడని ఆ నటి ఆరోపించింది.

తన భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ విడాకుల పత్రాలను చూపించి తనను బంతియా పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇద్దరికీ తెలిసిన ఓ ఫ్రెండ్ ద్వారా బంతియా నటికి పరియమయ్యాడు. రాష్ట్ర సచివాలయంలో తనకున్న సంబంధాలతో గవర్నమెంట్ ఫ్లాట్ ఇప్పిస్తానని బంతియా నటికి ఆశ పెట్టాడు.

ఆ తర్వాత తరుచుగా బంతియా ఆమెను కలుస్తూ వచ్చాడు. షూటింగ్ స్థలాలకు కూడా వెళ్తుండేవాడు. ఆ విధంగా పెళ్లికి అతను ప్రతిపాదన పెట్టాడు. ఇరువురు 2010 జులై 23వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకు బంతియా భార్య నుంచి నటికి ఫోన్లు రావడం ప్రారంభమైంది. అది బయటపడిన తర్వాత బంతియా నటిని బెదిరిస్తూ వచ్చాడు. తనను వదిలేస్తే పని దొరకదంటూ హెచ్చరిస్తూ వచ్చాడు.

English summary
A Panvel-based politician, Sidharth Banthiya, was booked on Wednesday for allegedly cheating a Marathi actress by marrying her despite having a wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X