హాస్టల్ పైనుండి దూకి ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య!

రాయపూర్‌లోని ఖమర్ది ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఇది చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఎమ్మెల్యే కుటుంబం రాయపూర్‌కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే దంతేవాడ ప్రాంతానికి చెందినవారు. ఎమ్మెల్యే కూతురు మోనా ఖమర్దిలోని ఆదిత్య హైట్స్ భవంతి హాస్టల్‌లోని నాలుగో అంతస్తు నుండి దూకినట్లుగా రాయపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఓపి పాల్ చెప్పారు.
మోనా మయూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె రెండు రోజుల క్రితమే హాస్టల్‌లో చేరిందని పోలీసు అధికారి తెలిపారు. ఆమె వచ్చినప్పటి నుండి ఒంటరిగా ఉంటోందని, ఎవరితోను కలువడం లేదని స్నేహితులు చెప్పినట్లుగా ఆయన చెప్పారు.
మయూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఆదిత్య హైట్స్‌లోని నాలుగు, ఐదో అంతస్తులో నడుపుతున్నారు. దాదాపు 43 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆమె భవంతి పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోందని, ఆత్మహత్యకు గల కారణాలు విచారణలో వెల్లడవుతాయన్నారు.
మోనా అంతకుముందు రాయపూర్‌లోని మరో పాఠశాలలో చదివింది. అయితే మరికొందరు ఇది ప్రమాదం మాత్రమే అంటున్నారు. అనుకోకుండా ఆమె భవంతి పై నుండి పడి ఉండవచ్చునని చెబుతున్నారు. మోనా మాందవి తండ్రి భీమ మాందవి అధికార పార్టీకి చెందిన దంతెవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే.












Click it and Unblock the Notifications