నడి రోడ్డుపై భారీ గుంత: కారుతో సహా పడిన మహిళ
వాషింగ్టన్: అమెరికాలోని ఓహియోలో ఓ కారు గోతిలో పడింది. కారును ఓ మహిళ నడుపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రక్షణ సిబ్బంది మహిళను రక్షించి, క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. నార్త్ వెస్ట్ ఓహియో ప్రాంతంలోని ఓ జంక్షన్‌లో పెద్ద గుంత పడింది. అందులోనే ఆమె పడింది.

స్థానిక టోలెడో పోలీసు అధికారి జో హెఫెర్నాన్ మాట్లాడుతూ... రహదారిలో భారీ గుంత పడిందని, అది సుమారు పది ఫీట్ల లోతు ఉంటుందని చెప్పారు. రోడ్డు పైనున్న గుంతను కారును నడుపుతున్న డ్రైవర్ పమేలా నోక్స్ గుర్తించలేదని, దీంతో కారు గుంతలో పడిందని చెప్పారు.
ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా భయానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. గోతిని ఆమె గుర్తించలేకపోయారని, అంతలోపే ఆమె కారు అందులో పడిందని చూసిన వారు చెబుతున్నారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. రోడ్డు బాగు చేసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications