బయటకు చెప్పేవి కాదు: షిండేతో భేటీపై డిగ్గీ, 'టి' వేడి

షిండేతో మాట్లాడిన అంశాలు బయటకు చెప్పేది కాదని చెబుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలకు రోడ్ మ్యాప్ తయారు చేయమని ఆదేశించామని తెలంగాణ అంశంపై స్పందించారు. రాజకీయ వ్యూహం తయారు చేయమని రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పామన్నారు.
అంతకుముందు దిగ్విజయ్ సింగ్‌తో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణపై సాధ్యమైనంత తొందరగా నిర్ణయం వెలువడుతుందని, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సైతం ఢిల్లీ పెద్దలను కలిశారు. అయితే ఏం చర్చించారనే దానిపై ఆయన స్పందించలేదు.
సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణపై తేల్చాయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. అది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications