కెటిఆర్‌పై సెటిల్మెంట్ కథనం: రాధాకృష్ణకు నోటీసులు

కాగా కెటి రామారావు భూ సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనిపై ఆంధ్రజ్యోతి, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జరిగాయి. ఆ తర్వాత గత నెల జూన్ 24వ తేదిన కెటిఆర్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్, ఆ పత్రిక, పత్రిక సంపాదకుల పైన పరువు నష్టం దావా వేశారు. ఆయన నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఐపిసి సెక్షన్ 499 - 500ల కింద వారిపై కేసు నమోదు చేయాలని కెటిఆర్ తన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో ఎ1గా ఆమోద బ్రాడ్ కాస్టింగ్ పబ్లికేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఎ2గా వేమూరి రాధాకృష్ణ, ఎ3గా కనగంటి వెంకట శేషగిరి రావు, ఎ4గా సంపాదకులు శ్రీనివాస్‌లను నిందితులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధిగా ఉన్న తనపై వ్యక్తిగతంగా దూషిస్తూ తమ పరువును, పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ వార్తా సంస్థలు వ్యవహరించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు రాధాకృష్ణతో పాటు మిగిలిన వారికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications