షర్మిల యాత్రలో గన్‌మెన్ల దాష్టీకం, పార్టీ భేటీ రసాభాస

Tension in Sharmila padayatra
విశాఖపట్నం/నెల్లూరు/వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో సెక్యూరిటీ సిబ్బంది మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించింది. శుక్రవారం ఉదయం తాటిచెట్లపాలెం నుండి ప్రారంభమైంది. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై ప్రయివేటు సెక్యూరిటీ దాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఛానల్‌కు చెందిన కెమెరామెన్ గాయపడ్డట్లుగా తెలుస్తోంది.

కాగా షర్మిల పాదయాత్ర ఆర్టీసి కాంప్లెక్స్, అంబేడ్కర్ సర్కిల్, దాబా రోడ్డు, చిత్రాలయ రోడ్డు, జగదాంబ సెంటర్, జ్యోతిరావుపూలే సర్కిల్, ఆఫీసర్స్ క్లబ్, ఆర్కే బీచ్, వైయస్సార్ విగ్రహం సెంటర్ మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు షర్మిల చేపట్టిన యాత్ర 200 రోజుకు చేరుకుంది.

నెల్లూరు పార్టీ సమావేశం రసాభాస

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఇరువురి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరులో ఏర్పాటు చేసిన సమన్వయకర్తల సభ గందరగోళంగా మారింది. గూడురు నియోజకవర్గ సమన్వయకర్తలు బాలచెన్నయ్య, సునీల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

కోడ్ ఉల్లంఘన కేసులో..

ఇటీవల వరంగల్ జిల్లా మరిపెడలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభలో కోడ్ ఉల్లంఘన జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+