యజమానిని కరిచి చంపిన జర్మన్ జాతి పెంపుడు కుక్క

Dog bites owner to death
హైదరాబాద్: పెంపుడు కుక్క చేతిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో ఈ ఘటన గురువారం జరిగింది. నర్సింహా రెడ్డి అనే 75 ఏళ్ల వ్యక్తి తన ఇంటి దగ్గర పలువురు ఇతర గ్రామస్థులతో కలిసి పంచాయతీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో అందరు చూస్తుండగానే ఆయన పెంపుడు కుక్క అతనిని కరిచింది. అతని తొడ భాగాన్ని కొరికేసి చంపిది.

కుక్కను విడిపించడానికి పలువురు వ్యక్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కట్టెతో కుక్క కాళ్లపై బలంగా కొట్టడంతో నర్సింహా రెడ్డిని విడిచి పెట్టింది. నర్సింహా రెడ్డిని ఉస్మానియాకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. వృద్ధుడి ప్రాణాన్ని తీసిన కుక్కను గ్రామస్థులు అక్కడే చంపి గ్రామ శివారులో తగలబెట్టారు.

మృతుడు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని విషయమై మాట్లాడేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ పెంపుడు కుక్క జర్మనీ జాతికి చెందింది.

ఇద్దరి హత్య

మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలోని దొంగ రోడ్డుపై ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని మహిళ, మరో వ్యక్తిని దుండగులు గొంతుకోసి హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+