తిరస్కరణ: ప్రేయసి ఇంటి వద్ద టెక్కీ ఆత్మహత్యాయత్నం

పోలీసుల కథనం ప్రకారం - హైదరాబాదులోని ధూల్‌పేటకు చెందిన ఎ జైస్వాల్ అనే 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గురువారం సాయంత్రం నిజాంపేటలోని తన ప్రేయసి నివాసానికి వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులతో వాదనకు దిగాడు.
అమ్మాయి తల్లిదండ్రులపై దాడి చేయడానికి కూడా ఓ సమయంలో ప్రయత్నించాడు. ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నప్పుడు జైస్వాల్‌కు, ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది.
వారిద్దరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు విముఖత ప్రదర్శించారు. దీంతో అమ్మాయి జైస్వాల్‌కు దూరంగా ఉంటోంది. దీంతో ఆగ్రహించిన జైస్వాల్ గురువారం నేరుగా అమ్మాయి ఇంటికే వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న జైస్వాల్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications