కాంగ్రెస్ టు జగన్ పార్టీ: డిఎన్ఏపై రేవంత్, అంబటి పైర్

Revanth Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ డిఎన్ఏలోనే అవినీతి అనేది ఉందని, అందుకే అది కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంటుకుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీది తమ డిఎన్ఏనే అన్న రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు.

కాంగ్రెసు ఏమైనా చేస్తుంది: అంబటి

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెసు పార్టీ ఏమైనా చేస్తుందని, ఎవరినైనా వేధిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ములాకత్‌లకు అవకాశం ఎలా ఇచ్చారు?: యనమల

జైలులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల పట్ల జైలు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తు్ననారని, విచ్చలవిడిగా ములాకత్‌లకు అనుమతి ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. జైలులో కొందరు అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై విచారణ చేయాలని కోరుతూ గతంలో తాము ఇచ్చిన లేఖ, సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారానికి తగిన జవాబు రాలేదని అందులో పేర్కొన్నారు.

దీనిపై వ్యక్తిగతంగా ఏమైనా విచారణ చేయించారా, చేయిస్తే ఆ నివేదిక ఇవ్వాలన్నారు. విచారణ చేయకుండా ఏమీ జరగలేదని చెప్పవద్దన్నారు. 133 మంది రాజకీయ నేతలకు జైలు అధికారులు విచక్షమాధికారం కింద ములాకత్‌లు ఇచ్చారని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+