నటిస్తూ రాజకీయం, ఎన్టీఆర్ కుటుంబమైనా..: బాలకృష్ణ

సింహా వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాజకీయ ప్రాధాన్యం కలిగిన చిత్రంలో తాను నటిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నాటికి ఇది విడుదల చేస్తామన్నారు. నేటి రాజకీయాల్లో అవినీతి, అవకతవకలను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటు ఎన్నికలు నవంబరు లేదా డిసెంబర్ నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రవాసాంధ్రులు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేసిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు పోకతప్పదన్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తే చూడాలని ఉందంటే బాలకృష్ణ నవ్వి ఊరుకున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తరలి వచ్చి రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో చురుకైన పాత్ర పోషించాలన్నారు. కాగా ఈ సందర్భంగా పలువురు బాలకృష్ణ తమ ప్రాంతం నుండి పోటీ చేయాలని నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications