పరిస్థితి బాగాలేదనే రాజీనామా: జగన్ పార్టీపై బస్వరాజు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపడుతుంది కాబట్టే రాజీనామాలు అంటోందన్నారు. మరో రెండు రోజుల పాటు నిపుణులు, మేథావులతో సమావేశమవుతామని, తెలంగాణ ఏర్పాటు కోసం ఎవరు, ఏ పార్టీలు సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. ఢిల్లీ పెద్దలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నివేదికను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
తెలంగాణపై రోడ్ మ్యాప్ రావాలని అధిష్టానం సూచించిందన్నారు. అందుకే కసరత్తు చేస్తున్నామన్నారు. రేపు, ఎల్లుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో కసరత్తు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, దానితో ముడివడిన అంశాలతో నివేదిక రూపొందించనున్నట్లు చెప్పారు. కాంగ్రెసు కోర్ కమిటీ కీలక సమావేశం ఈ నెల 12న ఉండవచ్చునని తెలిపారు. విభజనపై ఈ నెల 17న ప్రకటన విడుదల చేసే అవకాశముందన్నారు.
ఆదినారాయణ రెడ్డి మాటేమిటి: శ్రీకాంత్ రెడ్డి
తమ పార్టీ పరిస్థితి దిగజారుతోందనే తాము రాజీనామాలు చేస్తున్నామని బస్వరాజు సారయ్య చెబితే, వారి పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అంటే కాంగ్రెసు పార్టీ పరిస్థితి కూడా దిగజారుతోందా అన్నారు.
సీమాంధ్ర నేతలతో అలర్ట్‌గా ఉండాలి: పొన్నం
సీమాంధ్ర నాయకులతో అలర్ట్‌గా ఉండాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. తెలంగాణ ప్రజా సంఘాలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ ఇవ్వడమంటే తెలంగాణకు సానుకూలంగా ఉన్నట్లేనని చెప్పారు.












Click it and Unblock the Notifications