ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య

Girl sets herself on fire
కరీంనగర్/హైదరాబాద్: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్టునర్సింగాపూర్‌లో ఓ యువతి తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

భార్య కాళ్లు, చేతులు నరికిన భర్త

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం బందరువానిపాలెంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ భర్త కట్టుకున్న భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవాండ్లపూడిలో ఇంజనీరింగ్ విద్యార్థిపై స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా చీపురుపల్లి - సుభద్రపురం మెయిన్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కర్రల లోడుతో వెళుతున్న లారీ ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. కర్నూలులో ఆగి ఉన్న ఆర్టీసి బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+