విభజన: రాజీనామాపై జగన్ నేతకి టిడిపి ఎమ్మెల్యే షాక్

ఈ భేటీలో రాయలసీమను విడగొట్టవద్దని, విడగొట్టే హక్కు అధికార పార్టీకి ఎవరిచ్చారని చర్చించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలకు సైతం సిద్ధమని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు శాసన మండలి సభ్యులు స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను జెఏసి ప్రతినిధులకు ఇచ్చారు.
ఈ సమయంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమను విడగొడితే తాము రాజీనామాలకు సిద్ధమన్నారు. పార్టీలకతీతంగా అందరం రాజీనామా చేస్తామన్నారు. టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా రాజీనామా చేస్తానని ఫోన్లో చెప్పారన్నారు. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై లింగా రెడ్డి స్పందించారు.
తాను రాజీనామా చేస్తానని ఎవరితో చెప్పలేదన్నారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయమే ఫైనల్ అన్నారు. కాగా సమైక్యాంధ్ర కోసం కడప జిల్లా నుండి రాజీనామాల పర్వం ప్రారంభమైంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ సూచించారు.












Click it and Unblock the Notifications