అడుక్కు తినేవారిలా చూస్తున్నారు: సోమిరెడ్డి ఆవేదన

ఆరు దశాబ్దాలలో ఎక్కువ శాతం నిధులు, హైదరాబాద్, తెలంగాణ ప్రాంత అభివృద్ధికే ఖర్చు అయ్యాయన్నారు. సీమాంధ్రులు రెండేళ్లలో ఆస్తులు అమ్ముకొని వెళ్లాలని చెప్పడం సరికాదన్నారు. సీమాంధ్రులను అడుక్కుతినేవారిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దిగ్విజయ్‌తో కోట్ల, రేణుక భేటీ
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సీనియర్ నేత రేణుకా చౌదరి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే రాయలసీమను విభజించవద్దని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఓయు జెండా ఆవిష్కరణ
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితిలు ఈ రోజు ఓయు జెఏసి పార్టీ జెండాను ఆవిష్కరించాయి. తాము పార్టీని స్థాపిస్తామని ఓయు జెఏసి, టిజెఏసి ప్రకటించిన విషయం తెలిసిందే. తాము సెప్టెంబర్ 16వ తారీఖున పార్టీని ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications