మావోల రెక్కీ: కెసిఆర్ కుట్ర చేస్తున్నారని మోత్కుపల్లి

మోత్కుపల్లిని అంతం చేయడానికి మావోలు రెక్కీ నిర్వహించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. తనను భౌతికంగా అంతం చేయడానికి కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తెరాసలో చేరిన మాజీ నక్సలైట్లు తనను హత్య చేసే కుట్రకు సూత్రధారులని ఆయన అన్నారు.
తమ పార్టీ శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హత్యకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించినట్లు వచ్చిన వార్తలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
మోత్కుపల్లి నర్సింహులుకు అదనపు భద్రత కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. మోత్కుపల్లిపై రెక్కీ నిర్వహించినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ కోర్టు ఆవరణలో ఎకె 47 అవహరణ కేసుపై విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.












Click it and Unblock the Notifications