కూలిన బిల్డింగ్: సిటీలైట్ హోటల్ విషాదం (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూలిన హోటల్ భవనం ఘటనలో పదమూడు మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద ఉన్న వారిని సహాయక సిబ్బంది రక్షిస్తోంది. ఇప్పటి వరకు పన్నెండు మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్పారు.

హోటల్ కుప్పకూలిన ప్రమాదంలో సిటీలైట్ హోటల్ యజమాని కుమారుడు కూడా మృతి చెందాడు. మృతి చెందిన వారిలో ఒరిస్సాకు చెందిన సంతోష్, రాజీవ్, మురళీ, హోటల్ సిబ్బంది మనోజ్, జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ బాలకృష్ణ, నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన రమేష్, హైదరాబాదులోని బన్సీలాల్‌పేటకు చెందిన దుర్గయ్య, పాన్ బజార్‌కు చెందిన రమేష్‌లు ఉన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సహాయ చర్యలను వారి సమీక్షించారా అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సిటీలైట్ హోటల్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంపై అరుణ్ కుమార్ అనే న్యాయవాది మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

కుప్పకూలిన భవనం

సికింద్రాబాదులోని రాష్ట్రపతి రహదారిలో కుప్పకూలిన సిటీ లైట్ హోటల్ భవనం. ఉదయం ఆరున్నర గంటల సమయంలో భవనం కూలిపోయింది.

కిరణ్ పరిశీలన

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రమాద స్థలంలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సహాయ చర్యలు

హోటల్ భవంతి కూలిన ప్రాంతంలో సహాయ చర్యలు చేపడుతున్న దృశ్యం. భవంతి కూలడంతో ఆ రహదారిని మళ్లించారు.

జెసిబితో సహాయ చర్యలు

శిథిలాల పలువురు ఉన్నారని తెలియడంతో జెసిబి వంటి వాటితో సహాయ చర్యలు జాగ్రత్తగా చేపడుతున్నారు.

ప్రమాద స్థలి వద్ద

ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించి వెళ్లారు.

పరామర్శ

ప్రమాదంలో గాయపడ్డ ఓ బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి. పక్కన మంత్రులు ముఖేష్ గౌడ్, గీతా రెడ్డి తదితరులు.

మరో బాధితుడుకి...

ఆసుపత్రిలో మరో బాధితుడిని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి. ఎలా ఉందని అడుగుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+