మమతా బెనర్జీ ఫోన్: జగన్‌తో చర్చిస్తామన్న మైసూరా

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ ముప్పై లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని మైసూరా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలలో తమ పార్టీ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా అని, జగన్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారన్నారు.
అసెంబ్లీ ఖర్చులపై వివరాలకు గోనె దరఖాస్తు
2009 నుండి ఇప్పటి వరకు అసెంబ్లీలో మరమ్మతులు, ఇతర వ్యయాలకు సంబంధించి ఖర్చైన నిధుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ రావు సోమవారం అసెంబ్లీ కార్యాలయ సమాచార అధికారికి లేఖ రాశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మరమ్మతులు, టివిలు, కంప్యూటర్ల కొనుగోలు, ఎమ్మెల్యేల ఖర్చులకు టెండర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలపై వివరాలు తెలుపాలని అతను లేఖలో కోరారు.
వైయస్‌కు కెవిపి నివాళి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైయస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెసు పార్టీ నేతలు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు తదితరులు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications