వైయస్ జయంతి: షర్మిల రక్తదానం, బొత్స మండిపాటు

ఈ రోజు వైయస్ జయంతి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేడుకలను జరుపుకుంటోంది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పార్టీ సీనియర్ నేత జనక్ ప్రసాద్ పండ్లను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వెల్లంకినగర్‌లోని వైయస్ విగ్రహానికి వైయస్ వివేకానంద రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజంపేటలో, ఎమ్మెల్యే శ్రీనివాసులు రైల్వేకోడూరులో, సీనియర్ నేత ప్రసాద్ రెడ్డి ప్రొద్దటూరులో వైయస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. రోగులకు పండ్లను పంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైయస్ జయంతిని ఆ పార్టీ జరుపుకుంది. వైయస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ వద్ద నివాళులు అర్పించారు.
బొత్స ఆగ్రహం
సిఎల్పీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి తనకు కనీస సమాచారం లేకపోవడంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైయస్‌కు నివాళులు అర్పించే అంశంపై సైతం తనకు సమాచారం లేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఆయన ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను నిలదీశారు.












Click it and Unblock the Notifications