జగన్ పార్టీ డబుల్ గేమ్: తెలంగాణపై ఆనం, రిజైన్లపై కెకె

రాజకీయ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం డబుల్ గేమే అన్నారు. అది సరికాదన్నారు.
సీమాంధ్రులు ఆస్తులు అమ్ముకొని పోవాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు చెప్పడం సరికాదని రౌతు సూర్యప్రకాశ్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎవరు, ఎక్కడైనా ఉండవచ్చునని చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కాంగ్రెసు పార్టీకి చెందిన వారందరూ కట్టుబడి ఉండాలన్నారు.
తెలంగాణపై ఏ ప్రాంతానికి చెందిన నాయకులైన తమ పార్టీకి చెందిన వారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ప్లీనరీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం: కెకె
తెలంగాణపై తమ పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి అన్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన అంశాన్ని పార్టీ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications