బుద్ధగయ పేలుళ్లు: ఒక అనుమానితుడి అరెస్టు

పాట్నా/ కోల్‌కతా: బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయలో సంభవించిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో పోలీసులు ముజాహిదీన్ సభ్యుడు అన్వర్ హుస్సేన్ మాలిక్‌ను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో అతన్ని అరెస్టు చేసారు. అతని వద్ద 1.9 లక్షల నకిలీ కరెన్సీ కూడా లభించింది. 2010లో 17 మంది మృతికి కారణమైన పూణే జర్మన్ బేకరీ పేలుళ్లకు అతను పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు.

అతన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతన్ని కోర్టు 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. అతన్ని పోలీసులు ప్రశ్నించనున్నారు. బుద్ధగయలో పేలుళ్లకు కారణమని భావిస్తున్న ఇద్దరు వ్యక్తుల స్కెచ్‌లను పోలీసులు ఆదివారం విడుదల చేశారు.

Bodh Gaya blasts: Suspect arrested from West Bengal

బుద్ధగయలోని మహాబోధి ఆలయాన్ని 9 వరుస పేలుళ్లు వణికించాయి. ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిది. ఆ తర్వాత నాలుగు పేలుళ్లు ఆలయం లోపల, నాలుగు పేలుళ్లు వెలుపల సంభవించాయి. అరగంట వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించాయి.

విదేశీ యాత్రికులు తక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం సంభవించేలేదని భావిస్తున్నారు. ఈ పేలుళ్లు విదేశాలకు చెందిన ఇద్దరు యాత్రికులు గాయపడ్డారు. ఆలయం, బోధి వృక్షం కూడా భద్రంగానే ఉన్నాయి. ఎన్ఐఎ, ఎన్ఎస్‌జి రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి.

ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉండవచ్చుననే ఉద్దేశంతో గత వారమే తనిఖీలు జరిగాయి. మోక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. భద్రతను పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+