ఏమైనా ఎదుర్కొంటాం: టిపై డిగ్గీ, జగన్ పార్టీ పొత్తుపై...

కిరణ్, దామోదర, బొత్సలు నివేదిక ఇవ్వడానికి ఓ గడువు అంటూ ఏమీ లేదని చెప్పారు నేతలు ఎప్పుడైనా వచ్చి తమ నివేదికను తమకు ఇవ్వవచ్చునని చెప్పారు. అయితే వారు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందన్నారు. నివేదికను బట్టి తెలంగాణపై అటో ఇటో తేల్చేస్తామన్నారు. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఆ ముగ్గురి ప్రజెంటేషన్‌కు అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. రోడ్ మ్యాప్ మాత్రమే కాకుండా రాజకీయ వ్యూహం కూడా తయారు చేయాలని చెప్పామని, కోర్ కమిటీలో తాను, గులాం నబీ ఆజాద్, రాహుల్ గాంధీ ఉంటామన్నారు. తెలంగాణపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడనన్నారు. జగన్ పార్టీతో పొత్తు రాహుల్ నేతృత్వంలోని సబ్ కమిటీ చూసుకుంటుందన్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్, రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు, కోస్తాలో తెలుగుదేశం పార్టీలే తమకు పోటీ అన్నారు. కాగా ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి విద్యార్థులు ఈ రోజు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. పిడమర్తి రవి ఆధ్వర్యంలో డిగ్గీని కలిశారు.












Click it and Unblock the Notifications