బిజెపి వ్యాఖ్యలకు, బుద్దగయకు లింకుందా?: దిగ్విజయ్

వారి వ్యాఖ్యలకు, పేలుళ్లకు ఏమైనా సంబంధం ఉందా? అని సామాజిక వెబ్‌సైట్లో ప్రశ్నించారు. అదే సమయంలో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. అసలు నిజం ఎన్ఐఏ దర్యాఫ్తులో తేలుతుందన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యల పైన బిజెపి మండిపడింది. దీంతో డిగ్గీ వెనక్కి తగ్గారు. రాజకీయ పార్టీలు గానీ, మీడియా గానీ ఏ అంశానికైనా ముందే ముగింపు ఇవ్వరాదని మళ్లీ పేర్కొన్నాడు.
నితీష్ కుమార్‌ను విమర్శించడం ద్వారా..
బుద్దగయలోని పేలుళ్లపై నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోందని దిగ్విజయ్ ఈ రోజు మీడియా సమావేశంలో అన్నారు. నిన్న పేలుళ్లు జరిగిన వెంటనే బిజెపి సీనియర్ నేతలు శివశంకర ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూడీలు నితీష్ కుమార్‌ను తప్పు పట్టారన్నారు. తద్వారా దీనిని రాజకీయం చేయాలనుకున్నారా అన్నారు. ఎన్ఐఏ విచారణ తర్వాత ఏదైనా తేలుతుందన్నారు. విచారణ అనంతరం కుట్రదారులకు శిక్ష పడుతుందన్నారు.
ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ అంశంపై మాట్లాడుతూ.. తాను ఇష్రత్ ఎన్‌కౌంటర్ కేసును గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఎప్పుడు లింక్ పెట్టలేదన్నారు. తీవ్రవాదం విషయంలో కాంగ్రెసు పార్టీ తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. కొందరు కాంగ్రెసు నేతలు తీవ్రవాదులకు అధికార ప్రతినిధులుగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications