పిక్చర్స్: పేలుళ్లకు బిత్తరపోయారు, బోధివృక్షం భద్రం
పాట్నా: బీహార్‌లోని బుద్ధగయలో గల మహాబోధి ఆలయం లోపల, వెలుపల సంభవించిన 9 బాంబు పేలుళ్లు దిగ్భ్రాంతికి గురి చేశాయి. టిబెట్, మయన్మార్‌లకు చెందిన ఇద్దరు బౌద్ధ సన్యాసులు గాయపడ్డారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తు చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్‌ఎస్‌జి) అధికారులు, పేలుడు పదార్థాల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పేలుళ్ల ఘటనకు సంబంధించిన సాక్ష్యాల సేకరణలో, దర్యాప్తులో వారికి రాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారు. 1500 ఏళ్ల ప్రాచీనమైన మహాబోధిని యునెస్కో ప్రపంచ హెరిటేజ్ స్థలంగా గుర్తించింది. ఆలయంలో లోపల ఉన్న బోధి వృక్షానికి పేలుళ్ల వల్ల ఎటువంటి నష్టమూ సంభవించలేదు. ఈ పవిత్ర వృక్షం కిందనే బుద్ధడు జ్ఝానోదయం పొందాడని అంటారు.
బుద్ధగయకు శ్రీలంక, చైనా, చైనా, జపాన్ తదితర దేశాల నుంచి నిరంతరం బౌద్ధ భిక్షువులు, యాత్రికులు వస్తుంటారు. మొదటి పేలుడు ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పేలుళ్లలు ఆలయం లోపల, నాలుగు వెలుపల సంభవించాయి.

ఆదివారంనాడు బుద్ధగయలో సంభవించిన పేలుళ్లలో గాయడిన బౌద్ధ భిక్షువుకు చికిత్స అందిస్తున్న దృశ్యం

బుద్ధగయలో ఆదివారంనాడు సంభవించిన బాంబు పేలుళ్లలో గాయపడిన బౌద్ధ భిక్షువుకు అనుగ్రహ్ మగధ వైద్య కళాశాలలో చికిత్స చేస్తున్న దృశ్యం.

బుద్ధగయలో పేలుళ్ల తర్వాత వచ్చిన భద్రతాధికారుల వైపు చూస్తున్న బౌద్ధ భిక్షువు

బుద్ధగయలోని ఆలయంలో పేలుళ్లకు గాయపడిన వారి రక్తంతో తడిసిన నేల. వరుసగా 9 పేలుళ్లు సంభవించాయి.

పేలుళ్లు జరిగిన బుద్ధగయంలోని స్థలాన్ని భద్రతాధికారులు సందర్శించారు.

బోధివృక్షం వెనక భక్తులు దీపాలు వెలిగించే స్థలాన్ని పరిశీలిస్తున్న భద్రతాధికారి

బుద్ధగయంలోని మహాబోధి ఆలయం వెలుపల ప్రార్థనలు చేస్తున్న బౌద్ధ భిక్షువు

మహాబోధి ఆలయం సముదాయంలో పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలిస్తున్న భద్రతాధికారులు

వరుస పేలుళ్లు సంభవించిన తర్వాత మహాబోది ఆలయాన్ని సందర్శించిన ఎన్ఐఎ బృందం

బాంబు పేలుళ్ల తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడుతున్న డిజిపి అభయానంద్

బాంబు పేలుళ్లు సంభవించిన తర్వాత బుద్ధగయలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించిన నితీష్ కుమార్

బుద్ధగయంలో స్వాధీనం చేసుకున్న కేన్ బాంబును నిర్వీర్యం చేస్తున్న భద్రతాధికారులు

బుద్ధగయలోని హోటల్ వద్ద లభించిన మరో బాంబును నిర్వీర్యం చేస్తున్న బాంబు డిస్బోజల్ స్క్వాడ్

బుద్ధగయలో వరుస పేలుళ్ల ఘటనకు కుట్రదారులుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల స్కెచ్‌లను విడుదల చేశారు.

బుద్ధగయ పేలుళ్లకు నిరసనగా బెజిపి కార్యకర్తలు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

వరుస బాంబు పేలుళ్లకు నిరసనగా బౌద్ధ సమాజానికి చెందిన ప్రజలు ప్రదర్శన నిర్వహించారు.

పేలుళ్లకు నిరసనగా బౌద్ద బిక్షువులు మౌన ప్రదర్శన నిర్వహించారు.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు

వరుస బాంబు పేలుళ్ల తర్వాత చిన్నారి బౌద్ధ బిక్షువులు ఇలా బిత్తరపోయారు

బుద్ధగయలో 2557 బుద్ధ జయంతి సందర్భంగా వెలుగులు విరజిమ్ముతన్న మహాబోధి ఆలయం

బుద్ధ జయంతి సందర్భంగా థాయ్‌లాండ్ బౌద్ధ భిక్షువులు ఇలా..












Click it and Unblock the Notifications