వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య జెఏసి డెడ్‌లైన్: పురంధేశ్వరి, టిఎస్సార్‌కి సారె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari - T Subbirami Reddy
న్యూఢిల్లీ/విశాఖ: ఈ నెల 12వ తేదిన సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి మంగళవారం తుది గడువును నిర్ణయించింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో సమైక్యాంధ్ర ఐకాస అప్రమత్తమైంది.

రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు రాజకీయ నాయకులు ఏకతాటి పైకి రావాలని, రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఈ నెల 12వ తేదిలోగా నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. లేదంటే తాము ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు.

రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు విశాఖ సమైక్యాంధ్ర జెఏసి మంగళవారం కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డికి చీర - సారెను పంపించారు. వారు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎప్పుడు ప్రకటన చేయలేదని అందుకే సారె పంపిస్తున్నట్లు చెప్పారు.

దిగ్విజయ్‌ను కలిసిన ఎంపీలు

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్‌లు మంగళవారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Samaikyandhra JAC put deadline to Seemandhra leaders for their resignations over Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X