బాబుకు నై: జగన్‌పార్టీలోకి వరుణ్ మోటార్స్ అధినేత?

 Varun motors owner may join in YSRCP
విశాఖపట్నం: 'వరుణ్ మోటార్స్' అధినేత ప్రభుకిశోర్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆయన విశాఖపట్నం లోకసభ సీటు టికెట్‌ను ఆశిస్తున్నారని అంటున్నారు. వ్యాపారవేత్తగా పేరు గడించిన ప్రభు కిశోర్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకసభ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రభు కిశోర్ గతంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మెలిగేవారు. ప్రభుకిశోర్ సోమవారం ఆకస్మికంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శిబిరంలో కనిపించారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ పెద్దలు సోమవారం పెందుర్తిలో క్యాంపు వేశారు.

అక్కడ వైవీ సుబ్బారెడ్డి తదితరులు సమావేశమై ఉండగా ప్రభు కిశోర్ వచ్చి వారిని కలిశారు. ఈ పరిణామం ఆ పార్టీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, అందుకే సుబ్బారెడ్డిని కలిశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు తరఫున విశాఖ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. విశాఖ నుంచి షర్మిల లేదంటే వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలో ప్రభు కిశోర్ చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+