సిటీ లైట్ హోటల్ విషాదం: తెలియని నలుగురి ఆచూకీ

City lights collapse: Four persons missing
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో శిథిలాలను తొలగించే పని మంగళవారం ఉదయం కూడా కొనసాగుతోంది. ఈ విషాద ఘటనలో ఇంకా నలుగురి ఆచూకీ తెలియడం లేదు. వారు శిథిలాల కిందనే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. హోటల్ మేనేజర్ అలీ, టీ మాస్టర్ వెంకటేష్, చీఫ్ కుక్ కిరణ్, హలీం కార్మికుడు భరత్ జాడ తెలియడం లేదు.

ఆ నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులు సిటీ హోటల్ శిథిలాల వద్ద ఎదురు చూస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను కూడా పరిశీలించారు. అయితే, మృతుల్లో తమవారు లేకపోవడంతో వారు శిథిలాల కిందనే చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. టీ మాస్టర్ వెంకటేష్ భార్య ఆయమ్మ పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వెంకటేష్, ఆయమ్మలకు ఇద్దరు పిల్లలు. తన భర్త జాడ తెలియకపోవడంతో ఆమె గోడుగోడున విలపిస్తోంది. హలీం కార్మికుడు భరత్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాకు చెందినవాడని తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో శిథిలాల కింది నుంచి ఓ వ్యక్తిని బయటకు తీశారు. మిగతా నలుగురు కూడా శిథిలాల కిందనే ఉండవచ్చునని భావించి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

హోటల్ భవనం కూలిన ఘటనలో పదమూడు మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. శిథిలాల శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్పారు. హోటల్ కుప్పకూలిన ప్రమాదంలో సిటీలైట్ హోటల్ యజమాని కుమారుడు కూడా మృతి చెందాడు.

మృతి చెందిన వారిలో ఒరిస్సాకు చెందిన సంతోష్, రాజీవ్, మురళీ, హోటల్ సిబ్బంది మనోజ్, జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ బాలకృష్ణ, నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన రమేష్, హైదరాబాదులోని బన్సీలాల్‌పేటకు చెందిన దుర్గయ్య, పాన్ బజార్‌కు చెందిన రమేష్‌లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+