ప్రియుడు రాకేష్‌తో నటి కావేరీ రహస్య వివాహం
చెన్నై: నటుడు ప్రశాంత్ ఆరంగేట్ర చిత్రం 'వైకాశి పొరందాచ్చి' హీరోయిన్, బుల్లితెర నటి కావేరి రహస్యంగా వివాహం చేసుకుంది. చెన్నైకి చెందిన రాకేష్ అనే వ్యాపారవేత్తతో ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

తన సోదరుడి ద్వారా పరిచయమైన రాకేష్‌తో కొద్ది కాలంలోనే కావేరి ప్రేమలో పడింది. అయితే పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో, స్నేహితుల సహకారంతో రహస్య వివాహం చేసుకున్నట్లు సమాచారం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా రిషివందియం వద్ద వున్న ప్రసిద్ధ అర్థనారీశ్వర ఆలయంలో ఆదివారం ఉదయం ఈ జంట ఒక్కటైంది.
కావేరి తెలుగులోనూ పలు సీరియళ్లలో నటించి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం 'వంశం' అనే తమిళ సీరియల్‌లో నటిస్తోంది. గత ఆరు నెలలుగా వారిరువురి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు సమాచారం.
రాకేష్ కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందినవారు. రాకేష్, కావేరీలు కొద్ది మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. రాకేష్‌తో తన సోదరి కావేరి ఆనందంగా ఉంటుందని ఆమె సోదరుడు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications