గజదొంగలు: బాబు, కాంగ్రెస్‌పై జగన్ పార్టీ రివర్స్ అటాక్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని శోభా అన్నారు. పార్టీకి సంబంధం లేని విషయాన్ని ఎలా అంటగడతారని ఆమె ప్రశ్నించారు. కోలా కృష్ణ మోహన్ తనకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. టిడిపి, కాంగ్రెసు కుట్రలో భాగంగానే తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపిలే గజదొంగ పార్టీలు అన్నారు. నిన్న అరెస్టైన శ్రీధర్ రెడ్డికి తమ పార్టీలో సభ్యత్వమే లేదన్నారు. టిడిపి నేత కృష్ణయాదవ్ జైలుకు వెళ్లాడని, వి హనుమంత రావు డీజిల్ దొంగ అని ఆరోపించారు.
రేవంత్ పిల్ల కాకి: గట్టు
టిడిపి నేత రేవంత్ రెడ్డి ఓ పిల్ల కాకి అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు మెదక్‌లో మండిపడ్డారు. టిడిపి కాకి గోలకు తమ పార్టీ బెదిరేది లేదన్నారు. కాంగ్రెసు రెండు తలల పాము కాదని, మూడు తలల విషనాగు అన్నారు. రాజకీయ ప్రాధాన్యత కోసమే రాష్ట్రం విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తోందన్నారు.
జోగి రమేష్ ఫైర్
కత్తి, కర్ర అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేసి హత్య చేశాడన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా దోపిడీ చేయగల సమర్థుడన్నారు. కాంగ్రెసు నుండి ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారో చెప్పాలన్నారు. దోచుకున్న డబ్బు దాచుకునేందుకే ఆయన అమెరికా వెళ్లినట్లు చెప్పారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications