సెక్స్ స్కామ్: రాఘవ్ ఇంట్లోనే దాక్కున్నాడు

భోపాల్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడానికి ముందు 80 ఏళ్ల రాఘవ్‌జీ తాళం వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు. ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాఘవ్ భార్య, బంధవులు వివేక్‌లతో కలిసి ఫ్లాట్‌లోనే ఉన్నాడు. పోలీసులు లోనికి ప్రవేశించి ఆయనను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఆయనను భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తన పని మనిషి రాజ్‌కుమార్ డంగిని రాఘవ్‌తో పాటు అతని ఇద్దరు ఇనుచరులు లైంగిక వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

తొమ్మిదేళ్లుగా ఆ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన రాఘవ్ ఐదు రోజుల క్రితం రాజీనామా చేశారు. పని మనిషిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పని మనిషి అతని పైన కేసు పెట్టాడు. స్వలింగ సంపర్కం ఆరోపణలతో మధ్య ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాఘవ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.

 Raghavji

ఇంట్లోని పని మనిషి రాఘవ్ పైన స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాఘవ్ తన రాజీనామా లేఖను ఇచ్చారు. దీనిని గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ వద్దకు పంపారు. ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. రాఘవ్ పైన ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మంత్రి తనతో స్వలింగ సంపర్కం నెరిపారంటూ పని మనిషి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.

అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోలీసులకు అందజేశాడు. మంత్రికి చెందిన ఇద్దరు అనుచరులు కూడా తనతో అలాగే చేశారని ఆరోపించాడు. ఈ స్వలింగ సంపర్క రాసలీలలను మరో పని మనిషి రహస్యంగా చిత్రీకరించినట్లు అతను చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+