భయంతో గడిపేవాడు: లా'డెన్'పై నివేదిక, నిఘా వైఫల్యం

Pak failed to detect Osama's presence for 9 years: Report
ఇస్లామాబాద్: అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు అతను ఉన్న ప్రాంతాన్ని పాక్ సైన్య, ఐఎస్ఐ పసిగట్టలేకపోయాయని, అవి ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందాయని పాక్ దర్యాఫ్తు కమిషన్ తేల్చింది. లాడెన్ అంతమైన అనంతరం అతని మరణానికి దారి తీసిన పరిస్థితులపై పాక్ ప్రభుత్వం న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఆ కమిషన్ గత ఏడాది నివేదిక ఇచ్చింది.

అందులోని అంశాలు సోమవారం రాత్రి అల్ జజీరా టివి ఛానెల్ బయటపెట్టింది. స్థానిక డాన్ దినపత్రిక కూడా సోమవారం వార్తను ప్రచురించింది. 201 మంది సాక్ష్యులను విచారించి, 336 పేజీలతో న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు. పాకిస్తాన్ పోలీసు, నిఘా వ్యవస్థల చేతగానితనం వల్లనే అతను పాక్‌లో ఉండటాన్ని పసిగట్టలేకపోయారని ఎండగట్టింది. అదే సమయంలో డెన్‌లో లాడెన్ రహస్య జీవితం పైన కూడా నివేదికలో ఉంది.

అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి చేసిన కొద్దిరోజుల వ్యవధిలోనే లాడెన్, అతని కుటుంబం ప్రాణ రక్షణలో భాగంగా పాకిస్తాన్‌కు చేరినట్లు తాజాగా బయటపడింది. 2001 సెప్టెంబర్‌లో ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా దాడి చేసిన నేపథ్యంలో లాడెన్ కుటుంబం అదే ఏడాది అక్టోబర్/నవంబర్‌లలో పాకిస్తాన్‌లోకి ప్రవేశించిందని, 2002 మధ్యకాలంలో లాడెన్ కూడా పాక్‌లోకి వచ్చి కుటుంబంతో గడపడం మొదలు పెట్టాడని అబొట్టబాద్ కమిషన్ నివేదిక చెబుతోంది.

అంటే లాడెన్ చనిపోవడానికి దాదాపు పదేళ్ల నుంచే పాక్‌లో తలదాచుకున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఫలితంగా లాడెన్ కోసం విస్తృత స్థాయిలో వేట ప్రారంభించిన అగ్రరాజ్యంతో అతనెక్కడున్నాడో తెలియదంటూ బుకాయించిన పాక్ అసలు రంగు బయటపడింది. అంతేగాక లాడెన్ రైట్ హ్యాండైన అబు అహ్మద్ అలి కువైటిని వెతికే క్రమంలో 2009 నుంచి నవంబర్ 2010 వరకు పాకిస్తాన్‌కు అమెరికా భద్రతా ఏజెన్సీ సిఐఎ నాలుగు ఫోన్ నెంబర్లు ఇచ్చిందని తేలింది.

లాడెన్ అతని అనుచరుల ఆచూకీ తెలపడంలో భాగంగా పాక్‌కు ఈ నెంబర్లు ఇవ్వగా, ఇవి ఎప్పుడూ స్విచ్ ఆఫ్‌లోనే ఉండేవని, సిఐఎకి పాక్ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐ తప్పుడు సంకేతాలిచ్చిందని కూడా తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. తద్వారా పాక్ ఉగ్రవాదానికి ఊతమిస్తుందని తెలుస్తోంది.

నివేదికలోని కొన్ని అంశాలు... లాడెన్ ఒకసారి పాక్ పోలీసులకు దొరికినంత పని అయింది. స్వాత్ జిల్లాలో కుటుంబంతో కారులో వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని ఆపారు. కారులో లాడెన్‌కు తోడుగా కుడిభుజం ఇబ్రహీం ఉన్నాడు. అయితే విషయం వారి వద్దకు వెళ్లకుండానే ఇబ్రహీం వారి చేయి తడిపి అప్పుడు గండాన్ని గట్టెక్కించాడట.

ఇబ్రహీం కూతురు రహమా ఓసారి లాడెన్ ఫోటోను టివీల్లో చూసింది. అప్పటి నుండి కుటుంబ సభ్యులు ఆమెను లాడెన్ కుటుంబానికి దూరంగా ఉంచారు. లాడెన్ ఎప్పుడు కంగారుగా తిరుగుతుండేవనాడు. తనపై దాడి జరుగుతుందేమోననే ఆందోళనతో తరుచూ బయటకు వెళ్లేవాడు. నలుగురిలో తిరిగేవాడు కాదు. తన రహస్య ప్రాంతం నుండి లాడెన్ బయటకు వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఉపగ్రహ నిఘా ద్వారా తనను ఎవరు గుర్తు పట్టకుండా కౌబాయ్ టోపీ పెట్టుకొని తిరిగేవాడు.

లాడెన్ ఎక్కడున్నా సాదాసీదాగా ఉండేవాడు. అతనికి వస్తు వ్యామోహం అస్సలు లేదు. కేవలం మూడు జతల సల్వార్ కమీజులు వేసవికి, మరో మూడు సల్వార్ కమీజ్‌లు శీతాకారానికి ఉండేవి. ఆరోగ్యం బాగాలేకపోతే అరబ్బీ మందులు వేసుకునేవాడు. నీరసంగా ఉంటే చాకోలేట్, యాపిల్ తీసుకునేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+